రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించిన యువతి యువకులు పై కేసు నమోదు

by Kalyani |
రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించిన యువతి యువకులు పై కేసు నమోదు
X

దిశ, ఎల్బీనగర్ : నాగోల్ డివిజన్ పరిధిలోని పత్తులగూడ ప్రధాన రహదారిపై ఉదయం కారులో వచ్చిన యువతి, యువకుడు నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన వీరిపై శనివారం నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే పీర్జాదిగూడ కు చెందిన ఎలెక్స్ బోధిచర్ల అనే యువకుడు అతను స్నేహితురా లు తో కారులో వచ్చి పత్తుల గూడా రోడ్డు పక్కన మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీరి ఇరువురిని మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ మందలించడంతో యువతి యువకుల సీనియర్ సిటిజెన్లపై వాగ్వివాదానికి దిగడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నాగుల్ పోలీసులు యువతి, యువకులు వచ్చిన వారి కారు నెంబర్ ఆధారంగా వారిపై కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed