హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్ళు కొనసాగించాలి.. జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్ళు కొనసాగించాలి.. జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2న ముగియనుంది. 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. సమయం దగ్గర పడింది. మరో వారం రోజుల్లో గడువు ముగియనుంది. దీంతో నగరంలో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏపీకి మార్చబడుతున్నాయి. 2016లో 90% కార్యాలయాలు తెలంగాణ నుంచి ఏపీకి మారగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి కర్నూలుకు మార్చారు.

గడువు ముగింపుపై జై భారత్ పార్టీ చీఫ్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. హైదరాబాద్‌ను మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వాదన తెరపైకి తెచ్చారు. 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, మరో పదేళ్ళపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed