హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దారుణ పరిస్థితి.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-06 06:09:06  IST  )

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేటితో నాలుగో రోజు సైతం ఇండిగో విమానాలు రద్దయ్యాయి.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దారుణ పరిస్థితి.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేటితో నాలుగో రోజు సైతం ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో ఎయిర్ పోర్టుల్లో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాాబాద్ ఎయిర్ పోర్టు అయితే రైల్వే స్టేషన్ ను తలపిస్తోంది. రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో, బ్యాగులు ఎక్కడపడితే అక్కడే ఎలా ఉంటాయో అలాంటి గందరగోళ పరిస్థితి దర్శనం ఇస్తోంది. ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఇప్పటికే 69 ఇండిగో విమానాలు రద్దయినట్టు సమాచారం. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా ముంబాయి, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్‌పోర్ట్‌లలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణికులు ఇండిగో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. పరిస్థితిని సాధారణస్థితికి తీసుకువచ్చేందుకు ఇండిగో ప్రయత్నిస్తోంది. కొన్ని విమానాలను ఆలస్యంగా నడిపే ప్రయత్నం చేస్తోంది. VIDEO

Read More..

ఇండిగో విమాన సర్వీసులు రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

ఇండిగో సిబ్బందిని గౌరవించండి ప్లీజ్..! నటుడు సోనూసూద్ సంచలన ట్వీట్

Next Story