- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబోయ్.. బాబాయ్ హోటల్..! ఫుడ్ సేఫ్టీ టీమ్ షాకింగ్ రిపోర్ట్
హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో ఉన్న బాబాయ్ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు పారిశుద్ధ్య లోపాలు వెలుగుచూశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో ఉన్న బాబాయ్ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు పారిశుద్ధ్య లోపాలు వెలుగుచూశాయి. సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ బృందం చేపట్టిన ఈ తనిఖీల సందర్భంగా హోటల్ కిచెన్‌లో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో కిచెన్‌లో నీరు నిల్వ ఉండటం, ఎలుకల సంచారం కనిపించడం, దుర్వాసన రావడం, ఆయిల్ లీకేజీలు ఉండటం, చెత్త బుట్టలను మూతలు లేకుండా ఉంచడం వంటి అనేక లోపాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. హోటల్‌లో పరిశుభ్రత ప్రమాణాలు సంతృప్తికరంగా లేవని వారు పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో హోటల్‌కు హైజీన్ స్కోర్ కేవలం 62 శాతం (71/114) మాత్రమే నమోదైనట్లు వెల్లడైంది. ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా వెంటనే అవసరమైన సవరణలు చేపట్టాలని హోటల్ యాజమాన్యాన్ని అధికారులు ఆదేశించారు. గుర్తించిన లోపాలను త్వరితగతిన సరిదిద్దాలని సూచిస్తూ హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.కాగా, ఇందుకు సంబంధించిన వార్త వైరల్ కావడంతో బాబోయ్ బాబాయ్ హోటల్ అంటూ నెటిజన్‌లు షాక్‌కు గురయ్యారు.
నెటిజన్ల కామెంట్స్..






