- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో సిబ్బందిని గౌరవించండి ప్లీజ్..! నటుడు సోనూసూద్ సంచలన ట్వీట్
క్రూ షార్టేజ్, కొత్త డ్యూటీ రూల్స్ (FDTL), టెక్నాలజీ గ్లిచ్ ఇలా రకరకాల కారణాలతో దేశవ్యాప్తంగా 1,200కి పైగా ఫ్లైట్లు రద్దు అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: క్రూ షార్టేజ్, కొత్త డ్యూటీ రూల్స్ (FDTL), టెక్నాలజీ గ్లిచ్ ఇలా రకరకాల కారణాలతో దేశవ్యాప్తంగా 1,200కి పైగా ఫ్లైట్లు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ ఇండిగో సిబ్బందిపై చిందులు వేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా దుర్భాషలాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న ఇండిగో సిబ్బందికి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఆయన ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’లో ఒక ట్వీట్ చేశారు.
ఫ్లైట్ ఆలస్యమైతే నిరాశ కలుగుతుంది, కానీ దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్న ముఖాలను గుర్తుంచుకోవాలని సోనూసూద్ అన్నారు. దయచేసి ఇండిగో సిబ్బందితో మర్యాదగా, వినయంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాళ్లు కూడా ఫ్లైట్ రద్దుల భారాన్ని మోస్తున్నారని, మనందరం కలిసి వాళ్లకు మద్దతు ఇద్దామని సోనూ సూద్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ ప్రయాణికులు, ఇండిగో సిబ్బంది మధ్య సానుకూలతను పెంచేలా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read More... ఇండిగో విమాన సర్వీసులు రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిటిషన్ దాఖలు






