ఇండిగో విమాన సర్వీసులు రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-06 05:50:53  IST  )

ఇండిగో (Indigo) విమాన సర్వీసులు సుమారు వెయ్యికి పైగా రద్దు అవ్వడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇండిగో విమాన సర్వీసులు రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో (Indigo) విమాన సర్వీసులు సుమారు వెయ్యికి పైగా రద్దు అవ్వడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే శాఖ (Indian Railways) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోని 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యమైన 10 రూట్లలో నేటి నుంచి డిసెంబర్ 10 వరకు 37 ప్రీమియం రైళ్లకు మొత్తం 116 అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లుగా రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఇందులో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ కోచ్‌లు కూడా ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 18 రైళ్లలో చైర్ కార్, స్లీపర్ కోచ్‌లను పెంచారు. ఇక తూర్పు రైల్వేస్ పరిధిలోని 3 కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌ల సంఖ్యను పెంచారు. ఉత్తర రైల్వే జోన్ పరిధిలోని 8 రైళ్లలో థర్డ్ ఏసీ, చైర్ కార్ కోచ్‌లు పశ్చిమ రైల్వేస్ పరిధిలోని ఢిల్లీ-ముంబై వంటి రూట్లలో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లు ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ పరిధిలోని సెకండ్ ఏసీ కోచ్‌లను అదనంగా అటాచ్ చేశారు. అదేవిధంగా అంతేకాకుండా, అత్యధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. ఇండియన్ రైల్వేస్ తాజా నిర్ణయంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పాట్నా, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయణించే వారికి కాస్త ఉపశమనం లభించనుంది. ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ అదనపు కోచ్‌లలో సీట్లు బుక్ చేసుకోవచ్చిన రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Read More..

సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిటిషన్ దాఖలు

Next Story