సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిటిషన్ దాఖలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-06 05:46:50  IST  )

ఇండిగో (Indigo) ఫ్లైట్ సర్వీసుల రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో (Indigo) ఫ్లైట్ సర్వీసుల రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోని ఎయిర్‌పోర్టులన్నీ ప్రయాణికుల నిరసనలతో హోరెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. సమస్య జటిలమైన నేపథ్యంలో తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడానికి వీలుగా పిటిషనర్ తరపు న్యాయవాదిని అత్యవసర విచారణ కోసం సీజేఐ తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇండిగో విమాన ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క రోజే వెయ్యి విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈనెల 15లోగా సమస్య పరిష్కారం అవుతుందని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ (Peter Elbers) వెల్లడించారు. సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని విమానాలను రద్దు చేశామని అన్నారు. సిస్టమ్ రీబూట్ వల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తోందని ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇండిగో విమాన సర్వీసుల పునరుద్ధరణ క్రమంగా జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) తెలిపారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ్టి నుంచి దేశంలోని ఏ విమానాశ్రయంలోనూ ప్రయాణికుల ఎదురుచూపులు ఉండకూడదని ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు స్పష్టం చేశామన్నారు. విమానాశ్రయాల్లో ఏర్పడిన బ్యాక్‌లాగ్‌ను తగ్గించడమే ప్రభుత్వం ప్రధాన దృష్టి అన్నారు. అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో కలిసి రంగంలోకి దిగి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులలో చిన్నపిల్లలు, తల్లులు, వృద్ధులు, దివ్యాంగులకు చెక్-ఇన్, బోర్డింగ్‌లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని విమానయాన సంస్థలకు సూచించినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

Read More... ఇండిగో విమాన సర్వీసులు రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

Next Story