- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్ధన్నపేటలో కాంగ్రెస్‌కు ఊపు.. సీనియర్ నాయకుడు పార్టీ తీర్థం
by Batti.Sumithra |
వర్ధన్నపేట నియోజకవర్గం 43వ డివిజన్ కు చెందిన సీనియర్ నాయకుడు కొండపర్తి శ్రీనివాస్ ఆదివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్ : వర్ధన్నపేట నియోజకవర్గం 43వ డివిజన్ కు చెందిన సీనియర్ నాయకుడు కొండపర్తి శ్రీనివాస్ ఆదివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. మరింత పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మాడుగుల రాజ్ కుమార్, జిల్లా జనరల్ సెక్రటరీ నక్క కొమురెల్లి యాదవ్, సెక్రెటరీ వడ్డేపల్లి ప్రకాష్, మాజీ ఎంపీటీసీ చింత ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ సింగరాపు అరుణ, మైనార్టీ సెల్ అధ్యక్షులు అంజాద్ ఖాన్, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






