- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోతో అనుపమ బ్రేకప్.. పోస్ట్ వైరల్ !
యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2015 సంవత్సరంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనుపమ, వరుసగా హిట్స్ అందుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కూడా ఆమె ఎదిగారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకువెళుతోంది. అలాంటి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
ఆమె ప్రేమ బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం చేశారు. అయితే తాజాగా ఈ ఇద్దరు విడిపోయారనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతోంది. ఇక నుంచి నా గలాన్ని నేనే ఎంచుకుంటా.. ఎవరి అనుమతులు అవసరం లేదు, భయం లేదు అని తాజాగా అనుపమ ఓ పోస్ట్ పెట్టింది. అటు యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో కూడా చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరికీ బ్రేకప్ అయినట్లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్.






