ప్రపంచం చూపంతా ‘ఫ్యూచర్’ వైపే

by Malleboina Mahesh |   (  Updated:2025-12-07 02:45:09  IST  )

ఈ నెల 8, 9 తేదీల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ - 2025 స‌మ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ప్రపంచం చూపంతా ‘ఫ్యూచర్’ వైపే
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 8, 9 తేదీల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ - 2025 స‌మ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి రానున్న ప్రతినిధులను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మహా నగరాన్ని అందంగా ముస్తాబు చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ, ప్రత్యేక ఎట్రాక్షన్స్ మేళవింపుతో జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపించేలా..

గ్లోబల్ సమ్మిట్‌కు రానున్న ప్రముఖులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రతి అంశంలోనూ తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. సెక్రెటేరియట్ వద్ద అద్భుతమైన త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్‌‌తో రాష్ట్ర అభివృద్ధి తీరు, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించేందుకు ప్రణాళిక రూపొందించారు.

రైజింగ్ తెలంగాణ - 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్‌ప్లేలు ఉండనున్నాయి. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ఇన్‌లిట్ టెక్నిక్‌‌తో అద్భుతంగా ప్రదర్శించనున్నారు. హుస్సేన్‌సాగర్‌‌లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం లాంటి ముఖ్య అంశాలను చూపించనున్నారు.

భారీ డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్లు..

శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే అప్రోచ్ రోడ్డుపై భారీ డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై భారత్ ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం ఉంటుంది వంటి వివరాలు పొందు పరచనున్నారు. గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. సమ్మిట్ వేదిక వద్ద లోపలికి వెళ్లే మార్గాన్ని మొత్తం ఆధునిక త్రీడీ ఎనీ మార్ఫిక్ డిజైన్లతో రూపొందిస్తున్నారు. 50 మీటర్ల పొడవుతో డిజిటల్ టన్నెల్‌‌ను ఇంటరాక్టివ్ డిస్ ప్లే రూపంలో ఏర్పాటు చేసి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పురోగతిని విజువల్స్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పది వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్‌‌కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడున్న వలంటీర్లు ప్రజలకు సమ్మిట్ డైలీ షెడ్యూల్‌ను వివరించి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మొదటి రోజు (ఈనెల 8న) షెడ్యూల్​

- మధ్యాహ్నం 12 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.

- మధ్యాహ్నం 1:30కు రాష్ట్ర గ‌వ‌ర్నర్ జిష్ణుదేవ్‌వ‌ర్మ చేతుల మీదుగా ప్రారంభం.

- మ‌ధ్యాహ్నం 2.30 నిమిషాల‌కు సీఎం రేవంత్‌రెడ్డి కీల‌క ప్రసంగం.

- ఆర్థిక రంగ నిపుణులు అభిజిత్ బెన‌ర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్-మీడియా అండ్ టెక్నాల‌జీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడ‌ర్ ప్రసంగాలు

- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, నోబెల్ బ‌హుమ‌తి గ్రహీత కైలాష్ స‌త్యార్థి, కిర‌ణ్ మ‌జుందార్, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగాలు.

- సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు నాలుగు హాల్స్‌లో వేర్వేరుగా నాలుగు అంశాలపై చర్చలు. ఇందులో ప్రధానంగా పవరింగ్​తెలంగాణ ఫ్యూచర్, గ్రీన్ ​మొబిలిటీ, టేక్​తెలంగాణ, తెలంగాణ గ్లోబల్​ఎడ్యుకేషన్​హబ్​అంశాలపై నిపుణులు, మంత్రులు, సీనియర్​అధికారులు చర్చిస్తారు.

- సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకు తెలంగాణ ఫ్లయింగ్​హై టాలెంట్​మొబిలిటీ, హెల్త్​కేర్​ఫర్​ఆల్, కొరియా, ఆస్ట్రేలియా విదేశీ ప్రతినిధులతో చర్చలు

- సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు తెలంగాణ పార్ట్‌నరింగ్ విత్​ఏషియన్​టైగర్స్, గిగ్​ఎకానమీ, రైతుల ఆదాయం పెంపుదల, కెనడా, మహిళా పారిశ్రామిక వేత్తలు వంటి అంశాలపై చర్చలు.

రెండో రోజు (ఈ నెల 9న) షెడ్యూల్..

- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెషన్స్.​నాలుగు హాల్స్‌లో గంటన్నరకు ఒక అంశం చొప్పున డిస్కషన్.

- ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు జీనోమ్​వ్యాలీ, తెలంగాణ ఒలంపిక్​గోల్డ్​క్వెస్ట్, హెరిటేజ్​కల్చర్, ఫ్యూచర్ రెడీ టూరిజం, 3 ట్రిలియన్​ ఎకానమీ దిశగా అడుగులు.

- ఉదయం 11.45 గంటల నుంచి 1.15 వరకు ఇన్వెస్టింగ్ ​ఇంక్లూజన్, మూసీ రిజునవేషన్, బ్లూ, గ్రీన్​ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టటెడ్​తెలంగాణ.

- మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 3.45 వరకు భారత్ ఫ్యూచర్​సిటీ, బిల్డింగ్​తెలంగాణ ఎంటర్​ప్రైన్యూర్​షిప్, గ్లోబల్​కేపబులిటీ సెంటర్స్, ఇన్నోవేషన్​ పీపీసీలు

- సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు క్రియేటివ్​ కంట్రీ, ప్రతి ఒక్కరికీ అవకాశాల కోసం విస్తరణ, క్యాపిటల్​గ్రోత్, స్టార్టప్​ ఎకో సిస్టమ్.

- సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్​డాక్యుమెంట్​ఆవిష్కరణ, తెలంగాణ రైజింగ్​ 2047.

- రాత్రి 7 గంటలకు డ్రోన్​షో


Read More..

తెలంగాణ రైజింగ్.. గ్లోబల్ సమ్మిట్

దిగ్విజయంగా రెండేండ్లు.. రాజకీయంగా బలపడ్డ కాంగ్రెస్

Next Story