- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓటు కలకలం.. టెండర్ ఓటు వేయించిన అధికారులు
తన ఓటును వేరేవాళ్లు వేశారని ఓ మహిళల ఆందోళనకు దిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు (Telangana Panchayat elections) కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రశాతంగా పోలింగ్ జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) 11వ నెంబర్ పోలింగ్ బూత్‍లో దొంగఓటు కలకలం రేపింది. తన ఓటు ఎవరో వేశారంటూ మహిళ ఆందోళనకు దిగింది. కోటగిరి లక్ష్మి అనే మహిళ తన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. అయితే కోటగిరి లక్ష్మిపేరుతో ఓటు అప్పటికే పోల్ అయిందని అధికారులు తెలపడంతో ఆమె షాక్‍కు గురైంది. తన ఓటు వేరొకరు వేయడం ఏమిటని లక్ష్మితో పాటు ఆమె తరఫున బంధువులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు సదరు మహిళతో టెండర్ ఓటును (Tender vote) వేయించారు.
టెండర్ ఓటు అంటే ఏమిటి?
మన దేశంలోని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రధాన హక్కులలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ ఓటింగ్ సమయంలో ఒకరి ఓటును మరొకరు దొంగ ఓట్లు వేస్తుంటారు. దీంతో అసలు ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతాడు. ఇలా జరగకుండా ఇందుకోసం భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్49(పి)ను అమల్లోకి తెచ్చింది. పోలింగ్ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే ఈ సెక్షన్ ద్వారా మీరు టెండర్ ఓట్ వేసే అవకాశం ఉంది. పోలింగ్ అధికారులు అసలు ఓటరు అతడేనని నిర్ధారించుకుంటే సాధారణ బ్యాలెట్ పేపర్ బండిల్‌లోని చివరి బ్యాలెట్‌ను ఇస్తారు. టెండరు బ్యాలెట్‌గా ఓటు వేయడానికి అనుమతిస్తారు. అయితే ఆ టెండరు ఓటును బ్యాలెట్ బాక్సులో వేయకుండా ప్రిసైడింగ్ అధికారికి అప్పగిస్తారు. దాన్ని ప్రత్యేక కవర్‌లో పెట్టి టెండర్ బ్యాలెట్ వివరాలను సంబంధిత ఫాంలో నమోదు చేస్తారు. ఈ టెండర్ ఓటు నేపథ్యంలో 2018లో తమిళ హీరో విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన 'సర్కార్' సనిమా సైతం విడుదలైంది. ఓటు వేసేందుకు అమెరికా నుంచి విజయ్ రాగా అప్పటికే ఆయన ఓటును మరొకరు వేస్తారు. దీనిపై విజయ్ న్యాయపోరాటం చేసి తన ఓటు హక్కు దక్కించుకున్న తీరు ఈ సినిమాలో చూపించారు.
Read More..
భద్రాద్రి కొత్తగూడెం-మణుగూరు ZPHS పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన.. కుప్పగండ్లలో నిలిచిన పోలింగ్






