- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రి కొత్తగూడెం-మణుగూరు ZPHS పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండగా అక్కడక్కడా చిన్నచిన్న ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండగా అక్కడక్కడా చిన్నచిన్న ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు ZPHS ఎడ్యుకేషన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పినా వినకుండా కార్యకర్తలు ప్రచారం చేయడంతో ఇరువురి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అయినప్పటికీ కార్యకర్తలు వినకుండా తమ గుర్తు పేరు గట్టిగా చెబుతూ పోలింగ్ కేంద్రం ముందే నిలబడ్డారు.
Read More..
ఉరుమడ్ల గ్రామంలో టెన్షన్.. టెన్షన్: భూపాల్ రెడ్డి Vs గుత్తా అమిత్ రెడ్డి
Next Story






