అనసూయకు నాగబాబు మద్దతు.. జనసేన నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-27 13:46:10  IST  )

అనసూయకు నాగబాబు మద్దతు.. జనసేన నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్

అనసూయకు నాగబాబు మద్దతు.. జనసేన నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: దండోరా సినిమా ఫంక్షన్‌లో స్త్రీల వస్త్రాధారణపై నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ఇటీవల ప్రముఖ యాంకర్ అనసూయ(Anasuya) స్పందిస్తూ.. శివాజీపై రెచ్చిపోయారు. దీన్నే అతి తెలివి అంటారు. ఒక్క మాటలతో చెప్పాలంటే, చేతగానితనంతో మాట్లాడుతున్నారు. అదేమంటే ఫేక్‌ ఫెమినిస్ట్‌లని మాపై ముద్రవేస్తారు. అసలు ఫెమినిజం అనేది లేదు. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉండాలి. స్త్రీ, పురుషులు ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఈ కాలంలో కూడా దుస్తుల గురించి మాట్లాడటం చేతగానితనం. స్వీయ నియంత్రణ లేని వాళ్లు, అభద్రతాభావంతో బతికే వాళ్లు మాత్రమే ఎదుటి వాళ్లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు అని ఓ రేంజ్‌లో శివాజీపై అనసూయ రెచ్చిపోయారు. ఆ తర్వాత శివాజీ కూడా అనసూయకు కౌంటర్ ఇచ్చారు.

అయితే.. ఈ వ్యవహారంపై తాజాగా జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu ) స్పందించారు. అనసూయకు మద్దతిచ్చి.. శివాజీపై విమర్శలు చేశారు. రాజకీయ నాయకుడిగానో, ఇండస్ట్రీకి చెందిన నటుడిగానో దీనిపై స్పందించడం లేదు.. ఒక సామాన్య వ్యక్తిగా దీని గురించి మాట్లాడుతున్నాను. ఆడపిల్లలు ఎలా ఉండాలి.. వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలి.. ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై ప్రతిఒక్కరూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అలా కామెంట్స్‌ చేయడం రాజ్యాంగం ప్రకారం తప్పు. ఆడవాళ్లు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలపై మహిళా సమాజం స్పందిస్తోంది. శివాజీ మాటల్లో ఎలాంటి తప్పులేదని అంటున్నారు. మంచి బట్టలు వేసుకోవాలని చెప్పడం కూడా తప్పేనా? అని మండిపడుతున్నారు. ‘‘హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మన సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడిన నాగబాబుని వెంటనే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి.. ఇలాంటి సంగ విద్రోహ శక్తులు రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉండటానికి అనర్హులు’’ సీరియస్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More..

అనసూయ వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతోంది.. మరోసారి నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

Next Story