ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతోంది.. మరోసారి నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-27 10:23:41  IST  )

ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతోంది.. మరోసారి నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతోంది.. మరోసారి నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ల వస్త్రాధారణపై నటుడు శివాజీ(Actor Shivaji) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్(Telangana Commission for Women) సీరియస్‌గా స్పందించి.. ఆయనకు నోటీసులు ఇచ్చింది. శనివారం శివాజీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీలో కొంతమందికి నాపై వ్యతిరేకత ఉంది. ఇప్పుడది చాలా క్లియర్‌గా అర్థం అవుతోంది. అందుకే నాపై కుట్ర చేశారని శివాజీ ఆరోపించారు. జూమ్ మీటింగ్ పెట్టుకుని మరీ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు.

దండోరా సినిమా ఫంక్షన్‌లో తాను చెప్పిన మాటలు నెగిటివ్‌గా కన్వే అవటం వల్ల తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మహిళా కమిషన్ ప్రభుత్వ రంగ సంస్థ. దీనిని తప్పకుండా గౌరవించాలనే ఉద్దేశంతో వచ్చాను. వివరణ ఇచ్చాను. ఆవేశంలో నేను మాట్లాడిన రెండు మాటలను తీసుకుని నాపై కుట్ర చేశారు. తండ్రి పాత్రలు చేస్తున్నాను కాబట్టి బిడ్డలకు చెప్పినట్లు చెప్పా. ఇందులో తప్పుడు ఉద్దేశం ఏమీ లేదు. ఏదేమైనా రెండు మిస్టేక్స్ జరిగాయి. ఇప్పటికే సారీ కూడా చెప్పాను. దయచేసి దీనిని ఇంతటితో ఆపేయండి అని మహిళా కమిషన్ ఎదుట శివాజీ వాపోయారు. ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

Read More..

మహిళా కమిషన్ ఎదుట ముగిసిన విచారణ.. శివాజీకి కమిషన్ సంధించిన ప్రశ్నలివే!

అనసూయ వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు

Next Story