అనసూయ వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-27 08:23:06  IST  )

దండోరా సినిమా ఈవెంట్ లో హీరోయ‌న్ల బ‌ట్ట‌ల‌పై న‌టుడు శివాజీ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా దీనిపైనే చ‌ర్చ జ‌రుగుతుంది.

అనసూయ వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: దండోరా సినిమా ఈవెంట్ లో హీరోయ‌న్ల బ‌ట్ట‌ల‌పై న‌టుడు శివాజీ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా దీనిపైనే చ‌ర్చ జ‌రుగుతుంది. తాజాగా శివాజీ వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయ‌న రెండో భార్య దివ్వెల మాధురి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శివాజీ మాట్లాడినదానిలో ఏ త‌ప్పు లేద‌న్నారు. కానీ ఆయ‌న వాడిన భాష త‌ప్పుగా ఉంద‌ని దానికి ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని అన్నారు. అన‌సూయ మాట‌ల‌ను తాను ఏకీభ‌వించ‌న‌ని చెప్పారు.ఆమె వేసుకునే బ‌ట్ట‌లు కూడా త‌న‌కు అస్సలు న‌చ్చ‌వ‌ని ఇలా చెప్పినందుకు త‌న‌ను ట్రోల్ చేసినా ప‌ర్వాలేద‌ని అన్నారు.

స‌నాత‌న ధ‌ర్మం గురించి, ఆల‌యాల గురించి అన‌సూయ మాట్లాడుతుంద‌ని మ‌నం అంత గొప్ప‌వాళ్లం కాద‌ని చెప్పారు. అన‌సూయ త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని దివ్వెల మాధురి అన్నారు. స‌నాత‌న ధ‌ర్మం గురించి ఏం తెలుసు అని అనసూయ మాట్లాడుతుంద‌ని ప్ర‌శ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒళ్లు క‌నిపించ‌కుండా ఏ బ‌ట్టలు వేసుకున్నా ల‌క్ష‌ణంగా ఉంటుంద‌ని అన్నారు. మ‌గ అయినా, ఆడ అయినా అలానే వేసుకోవాల‌న్నారు. దుస్తులు మంచిగా వేసుకుంటేనే అందంగా ఉంటార‌ని చెప్పారు. దుస్తులు మంచిగా వేసుకున్నా ఎవ‌రైనా తేడాగా ప్ర‌వ‌ర్తిస్తే అది మ‌గ‌వాళ్ల అనాగ‌రికమే అని వ్యాఖ్యానించారు.

Read Similar News : ఏ డ్రెస్ వేసుకోవాలనేది వాళ్ల ఇష్టం.. శివాజీ డ్రెస్సింగ్ కాంట్రవర్సీ పై నటి బిందు మాధవి సంచలన కామెంట్స్

వెనక్కి తగ్గని అనసూయ.. మరో సంచలన పోస్ట్.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!

Next Story