వెనక్కి తగ్గని అనసూయ.. మరో సంచలన పోస్ట్.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-27 08:24:53  IST  )

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

వెనక్కి తగ్గని అనసూయ.. మరో సంచలన పోస్ట్.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!?
X

దిశ,వెబ్‌డెస్క్: హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల వస్త్రధారణ పై శివాజీ కామెంట్స్‌కు యాంకర్ అనసూయ తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంలో కొందరు శివాజీకి సపోర్ట్ గా నిలుస్తుంటే, మరికొందరు అనసూయకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. శివాజీ కామెంట్స్ తర్వాత అనసూయ శారీలో ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో చాలా మంది కౌంటర్ వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా స్విమ్ షూట్ లో ఉన్న వీడియోను ఇన్ ‌స్టా వేదికగా షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు కావాలనే ఈ వీడియో షేర్ చేసిందంటూ వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఈ తరుణంలో యాంకర్ అనసూయ మరో పోస్ట్ వైరల్ గా మారింది. అదేంటంటే.. ‘‘ కొంతమంది రాబందులు, కొన్ని పనికిమాలిన మీడియా ఛానళ్ళు, సామాజిక అవగాహన లేని కొంతమంది స్మార్ట్ ఫోన్ల ద్వారా నాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి తమకు తోచిన రీతిలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో సామాన్యులను కన్‌ఫ్యూస్ చేస్తున్నారు’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Read Similar News : అనసూయ వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు

ఏ డ్రెస్ వేసుకోవాలనేది వాళ్ల ఇష్టం.. శివాజీ డ్రెస్సింగ్ కాంట్రవర్సీ పై నటి బిందు మాధవి సంచలన కామెంట్స్

Next Story