ఏ డ్రెస్ వేసుకోవాలనేది వాళ్ల ఇష్టం.. శివాజీ డ్రెస్సింగ్ కాంట్రవర్సీ పై నటి బిందు మాధవి సంచలన కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-12-27 08:20:44  IST  )

‘దండోర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఏ డ్రెస్ వేసుకోవాలనేది వాళ్ల ఇష్టం.. శివాజీ డ్రెస్సింగ్ కాంట్రవర్సీ పై నటి బిందు మాధవి సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘దండోర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఇప్పటికే దీనిపై చాలా మంది సెలబ్రిటీలు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఆయనతో కలిసి దండోర మూవీలో నటించిన బిగ్ బాస్ విజేత, హీరోయిన్ బిందు మాధవి కూడా ఆయన చేసిన కామెంట్స్ పై స్పందించింది. తాజాగా ఓ యాంకర్ శివాజీ మాట్లాడిన కామెంట్స్ పై మీ స్పందన ఏంటి అని అడుగగా దానికి ఆమె స్పందిస్తూ.. ‘ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంత అభిప్రాయం ఉంటుంది, అయితే అది అందరికీ వర్తించాలని కానీ, అందరూ దానిని అంగీకరించాలని కానీ లేదు.

ఎవరి ఇష్టం వాళ్లది. వస్త్రధారణ అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. సమాజంలో కేవలం దుస్తుల చుట్టూనే చర్చలు ఆగిపోవడం సరికాదు, అంతకంటే లోతైన సామాజిక అంశాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఒక అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఎవరైనా ఆమెపై చేయి వేస్తున్నారంటే, అది ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ తప్పా లేక అలా ప్రవర్తించిన అబ్బాయి బుద్ధి తప్పా?.. వేధింపులకు వస్త్రధారణను సాకుగా చూపడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ కేవలం డ్రెస్సింగ్ ఒక్కటే సమస్య కాదు, సమాజంలోని ఆలోచనా దృక్పథంలో కూడా మార్పు రావాలి.

తప్పు చేసే వారిని వదిలేసి, బాధితుల వేషధారణను వేలెత్తి చూపడం విచారకరం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. అయితే ఆ అభిప్రాయమే అంతిమ సత్యం కాదు. శివాజీ చెప్పిన విషయాలు ఆయన వ్యక్తిగతమైనవి కావచ్చు, కానీ వాటిని ఒక ప్రామాణికంగా భావించాల్సిన అవసరం లేదు. ఇతరుల జీవనశైలిని లేదా వస్త్రధారణను విమర్శించే ముందు, వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం నేర్చుకోవాలి. సమాజంలో మార్పు అనేది కేవలం ఒకరిని విమర్శించడం ద్వారా రాదు, ఆలోచనల్లో పరిణతి వచ్చినప్పుడే సాధ్యమవుతుంది’ అని బిందు మాధవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story