- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విక్రమ్-1 విజయగాథలో ముగ్గురు ఇంజనీర్ల కీలక పాత్ర
భారత ప్రైవేటు అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన 'విక్రమ్-1' ఆర్బిటాల్ రాకెట్ విజయవంతమైన ప్రయోగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: భారత ప్రైవేటు అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన 'విక్రమ్-1' ఆర్బిటాల్ రాకెట్ విజయవంతమైన ప్రయోగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఈ ప్రయోగంలో సిరిసిల్లకు చెందిన అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్, బొమ్మదేని నాగరాజు తమ సాంకేతిక నైపుణ్యాన్ని చాటారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు ఈ చారిత్రక ప్రయోగంలో భాగస్వాములు కావడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ ప్రయోగ వాహకమైన విక్రమ్-1, మొదటి ప్రయత్నంలోనే ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెట్టి భారత ప్రైవేటు అంతరిక్ష రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది.
ఈ విజయానికి సిరిసిల్ల యువత తమ వంతు సేవ అందించడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని నింపింది. ప్రయోగంలో అడుప సంతోష్ కుమార్ అవియానిక్స్ చెక్‌అవుట్ లీడ్గా రాకెట్ అవియానిక్స్ వ్యవస్థల తనిఖీలు, పరీక్షలు, ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక గ్రౌండ్ చెక్‌అవుట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. అడుప కిరణ్ రాకెట్ సిఎడి డిజైనర్గా రాకెట్ రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బొమ్మదేని నాగరాజు ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ ఇంజనీర్ గా రాకెట్ విద్యుత్ వ్యవస్థల సమీకరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత అంతరిక్ష విజయగాథలో సిరిసిల్ల యువత ముద్ర వేయడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై చాటడం లో భాగస్వాములు కావడం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






