- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా కమిషన్ ఎదుట ముగిసిన విచారణ.. శివాజీకి కమిషన్ సంధించిన ప్రశ్నలివే!
హీరోయిన్ల వస్త్రాధరణపై చేసిన కామెంట్లకు నటుడు శివాజీ నేడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ల వస్త్రాధరణపై చేసిన కామెంట్లకు నటుడు శివాజీ నేడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు శివాజీని కమిషన్ విచారించింది. విచారణలో ఐదు కీలక ప్రశ్నలు వేసింది. మహిళల పై మీరు చేసిన వాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం మీద ప్రభావితం చూపుతుందని కమిషన్ భావిస్తుంది. మీరేమంటారు? అంటూ కమిషన్ ప్రశ్నించింది. సినిమా నటుడిగా మీ వాఖ్యలు సమాజం పై ప్రభావం చూపుతాయి. ఇది మీకు తెలిసే ఇలాంటి వాఖ్యలు చేసారని కమిషన్ భావిస్తుందోని స్పష్టం చేసింది.
మహిళల వస్త్రాధారణ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని తెలిపింది. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా? అని అడిగింది. మీ వాఖ్యలు మహిళలను కించపరిచనట్లు కానట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కమిషన్ శివాజీని ఆదేశించింది. మీ వ్యాఖ్యలు మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని.. వీటికి మీ సమాధానం? ఏంటి అని ప్రశ్నించింది. అయితే భవిష్యత్ లో మహిళల వస్త్రాలంకరణ గురించి ఎలాంటి మాటలు మాట్లాడనని శివాజీ చెప్పినట్టు తెలుస్తోంది.
Read More..
ఆ ఇంటర్వ్యూలో ఆర్‌జీవీ ముద్దుపెట్టడానికి కారణం అదే.. అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్
వెనక్కి తగ్గని అనసూయ.. మరో సంచలన పోస్ట్.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!?
అనసూయ వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు






