- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఇంటర్వ్యూలో ఆర్‌జీవీ ముద్దుపెట్టడానికి కారణం అదే.. అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. అయితే డైరెక్టర్ ఆర్జీవీ(RGV)తో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఈ భామ నైటుకు నైటే ఫేమస్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్‌గా చాన్స్ వచ్చింది.
అక్కడ ఆ హౌస్‌లో అడుగు పెట్టిన ఈ చిన్నది అక్కడ కూడా నానా హంగామా చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మ టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ డోసు ఎక్కువగానే ఉంటుంది. నెట్టింట హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంటది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అషురెడ్డి రామ్ గోపాల్ వర్మ కిస్ చేసిన దానిపై ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. ‘నా కాళ్లను రామ్ గోపాల్ వర్మ కిస్ చేసింది పూర్తిగా స్క్రిప్టెడ్. చాలామంది ఆ ఇంటర్వ్యూలో అన్ని కూడా మా సొంత మాటలు అని అనుకున్నప్పటికీ.. దాని వెనుక ఓ ప్రణాళిక ఉంటుంది. నేను ఆ ఇంటర్వ్యూ అలా జరుగుతుందని ఊహించలేదు. అది మా పేరెంట్స్ దగ్గర నుంచి చుట్టుప్రక్కల వారి వరకు అందరికీ నెగటివ్‌గా వెళ్లింది. అయితే అది నా కెరీర్‌లో ఒక ప్రాజెక్ట్ మాదిరిగానే చూస్తాను. దాని తర్వాత ఆర్జీవీకి, నాకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More..
అనసూయ వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు






