- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills Results: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ షురూ
జూబ్లీహిల్స్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. యూసుఫ్ గూడలోలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం డీఆర్సీ సెంటర్‍లో పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. ఇళ్ల వద్ద వేసిన 103 బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ బ్యాలెట్ ఓట్ల ఫలితం మరో 10 నుంచి 20 నిమిషాల్లో తేలనుంది. అనంతరం ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నెల 11న జరిగిన పోలింగ్ లో 48.49 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఏడు డివిజన్లలో కలిపి 1,94,631 ఓట్లు పోలయ్యాయి. గత సాధారణ పోలింగ్ తో పోలిస్తే తాజా ఉప ఎన్నికలో స్వల్పంగా మాత్రమే ఓటింగ్ శాతం పెరగగా ఈ సారి జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి అసెంబ్లీకి పంపబోతున్నారు మరెవరిని ఇంటికి పరిమితం చేయబోతున్నారు అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. కాగా ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సర్వేలు అధికార కాంగ్రెస్ వైపు అంచనాలు వేయడంతో వాస్తవ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది మరి కాసేపట్లో తేలనుంది.
Read More..
కాసేపట్లో జూబ్లీహిల్స్ బై పోల్ కౌంటింగ్.. హార్ట్ ఎటాక్‌తో అభ్యర్థి మృతి






