బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

by Malleboina Mahesh |   (  Updated:2025-11-14 02:35:23  IST  )

దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) కోసం వేసిన ఓట్ల లెక్కింపు (Votes Counting) ఉదయం 8 గంటలకు అధికారికంగా ప్రారంభమైంది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) కోసం వేసిన ఓట్ల లెక్కింపు (Votes Counting) ఉదయం 8 గంటలకు అధికారికంగా ప్రారంభమైంది. మొత్తం 243 నియోజకవర్గాల కోసం రెండు దఫాల్లో జరిగిన పోలింగ్‌లో 67.13% మంది ఓటర్లు హాజరయ్యారు. ఇది 1951 తర్వాత రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఓటర్ల శాతం కావడంతో ఓట్ల లెక్కింపు, పలితంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తొలి దశలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం అధికారులు ప్రారంభించారు. దీని అనంతరం ఈవీఎంల లెక్కింపును ప్రారంభించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పర్యవేక్షణ, మూడు స్థాయిల భద్రత అమల్లో ఉన్నాయి.

ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ NDA కూటమి, మహాగఠబంధన్ మధ్య జరుగుతుంది. ఎక్కువ ఓటింగ్ శాతం వల్ల ఎన్నికల ఫలితాల్లో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఉదయం నుంచి ట్రెండ్స్ రావడం ప్రారంభమవుతాయని, అయితే స్పష్టమైన ఫలితాలు సాయంత్రం తర్వాతే బయటపడే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ (Exit polls) మాత్రం ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. మరి బిహార్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఏ కూటమి ఆధిక్యంలోకి వస్తుందన్న విషయంపై ప్రజలు, పార్టీలు, నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More..

Jubilee Hills Results: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్​ షురూ

Next Story