- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరోలకి కూడా తప్పని ఓటీటీ చిక్కులు
ఓటీటీ డీల్ సినిమాకు ఆర్థిక భద్రత కల్పించినప్పటికీ, విడుదల తేదీ విషయంలో నిర్మాతలకు షరతులు మరియు ఒత్తిడులు ఎదురవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఒక సినిమాను నిర్మించిన నిర్మాత సేఫ్ జోన్‌లోకి వెళ్లడంలో ఓటీటీ డీల్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. డిజిటల్ హక్కుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తే, నిర్మాతలు చాలా వరకు ఆర్థికంగా సురక్షిత స్థితికి చేరుకుంటారు. కొన్ని సినిమాలు అయితే చిత్రీకరణ దశలోనే ఓటీటీ డీల్‌ను పూర్తిచేసుకుంటాయి. అలాంటి ప్రాజెక్టులకు నిర్మాణ వ్యయ పరంగా కూడా నిర్మాతలకు మంచి లాభం చేకూరుతుంది. అయితే ఇంత ప్రయోజనం ఉన్న ఓటీటీ హక్కుల వెనక ఒక పెద్ద చిక్కు కూడా ఉంది. ఏదైనా సినిమాకు ఓటీటీ డీల్ కుదిరితే, వారు నిర్ణయించిన తేదీకే సినిమాను విడుదల చేయాల్సి ఉంటుంది. లేదంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇక ఓటీటీ డీల్ సెట్ కాకపోతే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే పరిస్థితి కూడా చాలాసార్లు ఉండదు. గతంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకే పరిమితమయ్యేవి. స్టార్ హీరోల సినిమాలైతే ప్రారంభ దశలోనే ఓటీటీ హక్కులను ఎవరో ఒకరు కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఓటీటీ సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అంచనాలు తక్కువగా ఉన్నా కూడా కొన్ని సినిమాలను కొనుగోలు చేయడానికి ఓటీటీ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్మాణం పూర్తయినా విడుదల తేదీని ప్రకటించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా ప్రస్తుతం ఓటీటీ చిక్కుల్లో చిన్న, మధ్యస్థాయి సినిమాలే కాకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.






