- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi: ‘మా పోరాటం ఆగేదే లేదు’.. జంతర్ మంతర్ వద్ద తాజా పరిస్థితి ఇదే!
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణపై సీజేపీ హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) తన 26 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన పోరాటపటిమకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అయితే, నీట్ (NEET) పేపర్ లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత నిరసన కొనసాగుతుందని వార పేర్కొన్నారు. ఇవాళ ఉదయం మళ్లీ విద్యార్థులంతా ఏకమై పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి’ అని ప్లకార్డులు పట్టుకుని బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేంద్రం నుంచి కొన్ని హామీలు లభించినప్పటికీ, మంత్రి రాజీనామా దక్కే వరకు జంతర్ మంతర్ వద్ద ధర్నాను విరమించేది లేదని సీజేపీ నేతలు స్పష్టం చేశారు.






