Allu Arjun: రాజకీయాల్లోకి అల్లు అర్జున్..! వ్యక్తిగత టీమ్ సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-24 04:36:03  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

Allu Arjun: రాజకీయాల్లోకి అల్లు అర్జున్..! వ్యక్తిగత టీమ్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఒకానొక దశలో ఆయన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ (Prashant Kishore)తో కూడా భేటీ అయినట్లుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై తాజాగా ఆయన మేనేజర్ శరత్ చంద్ర నాయుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టి పడేశారు. అవి ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు.

ఫుల్ ఫోకస్ సినిమాలపైనే..

అల్లు అర్జున్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత బిజీయెస్ట్ షెడ్యూల్ ఉన్న స్టార్ హీరోలలో ఒకరని, ఆయన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉందని మేనేజర్ శరత్ చంద్ర నాయుడు (Sharath Chandra Naidu) తెలిపారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా సినిమాలపైనే కేంద్రీకృతమై ఉందన్నారు. రాబోయే పదేళ్ల వరకు అల్లు అర్జున్ షెడ్యూల్స్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో కవర్ అయిన ఉన్నాయని వెల్లడించారు. ఇలాంటి సక్సెస్ ఫుల్ టైమ్‌లో ప్రాజెక్టులను పక్కనబెట్టి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చిరంజీవి, ఇతర సీనియర్ నాయకుల ద్వారా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా కల్పితమైన వార్త అని శరంత్ చంద్ర నాయుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Next Story