- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట!
by Malleboina Mahesh |
బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల; 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,330కి, కిలో వెండి ధర రూ. 2,35,000కి చేరిక.

X
దిశ, వెబ్ డెస్క్: దేశీయ మార్కెట్‌లో శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, బులియన్ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా పసిడి రేట్లు తగ్గుముఖం పట్టాయి. తాజా సమాచారం ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,850 తగ్గడంతో రూ.1,44,330కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు కూడా రూ.1,700 మేర తగ్గి రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు, పసిడి బాటలోనే వెండి ధర కూడా తీవ్రంగా పడిపోయింది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.5,000 వరకు తగ్గుదల నమోదు కావడంతో తాజా రేటు రూ.2,35,000 స్థాయికి చేరింది. వరుస పెరుగుదలతో ఆందోళన చెందుతున్న కొనుగోలుదారులకు, ముఖ్యంగా శుభకార్యాలు, ఆభరణాల కొనుగోలు ప్లాన్ చేసుకునే వారికి ఈ ధరల తగ్గుదల తీవ్ర ఊరటనిచ్చింది.
Next Story






