- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ మార్పుపై తొలిసారి నోరువిప్పిన మల్లారెడ్డి.. మీడియా ముఖంగా సంచలన ప్రకటన
తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నాయకుల పార్టీ మార్పులపై చర్చ ఊపందుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పొలిటికల్ సర్కిల్స్‌లో పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Malla Reddy) ఎండ్‌కార్డ్ వేశారు. ఇవాళ బీఆర్‌ఎ (BRS)స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో అందరినీ నవ్విస్తూ ఆయన ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలోకీ వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
తాను బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ఫేక్ న్యూస్ అని మల్లారెడ్డి కొట్టిపారేశారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని నమ్మి ఓ అభిమాని తన సొంత రక్తంతో లేఖ రాయడం తాను తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పేర్కొన్నారు. త్వరలోనే లేఖ రాసిన వ్యక్తిని స్వయంగా కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్‌కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ 125 ఏళ్లు బతకాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆరే ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆయన్ను సీఎం పీఠంపై చూడటమే తన లక్ష్యమని మల్లారెడ్డి కామెంట్ చేశారు.






