- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీటీపీఎస్ డీఏవీ స్కూల్ ప్రారంభోత్సవంలో వివాదం.. జర్నలిస్టులకు అవమానం!
by Jakkula.Mamatha |
మణుగూరులోని బీటీపీఎస్ డీఏవీ స్కూల్ ప్రారంభోత్సవం కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులను శుక్రవారం టీఎస్‌జెన్‌కో సివిల్ అధికారి అజయ్ బయటకు వెళ్లాలని దురుసుగా ఆదేశించిన ఘటన వివాదానికి దారితీసింది.

X
దిశ, మణుగూరు: మణుగూరులోని బీటీపీఎస్ డీఏవీ స్కూల్ ప్రారంభోత్సవం కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులను శుక్రవారం టీఎస్‌జెన్‌కో సివిల్ అధికారి అజయ్ బయటకు వెళ్లాలని దురుసుగా ఆదేశించిన ఘటన వివాదానికి దారితీసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన ఇతర అధికారులను లను కూడా తొలుత గుర్తించకుండా బయటకు పంపించారు. అనంతరం వారు జిల్లా అధికారులు అని తెలుసుకున్న తర్వాత లోపలికి అనుమతించారు. అంతే కాకుండా బీటీపీఎస్ అధికారులు ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేసిన మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మీడియా, జిల్లా అధికారులతో వ్యవహరించిన తీరుపై టీఎస్‌జెన్‌కో అధికారులు స్పష్టత ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






