- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: లీకేజీల చరిత్ర మీది కాదా? నగరంలో KTR ఫొటోతో వెలసిన పోస్టర్లు
బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీక్‌లను గుర్తుచేస్తూ కేటీఆర్‌పై నగరంలో ఫ్లెక్సీలు వెలవడం కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) పరీక్షల అక్రమాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KR) ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన వివిధ ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు ఘటనలను గుర్తుచేస్తూ కేటీఆర్‌కు వ్యతిరేకంగా నిలదీస్తున్నట్లుగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఆ పోస్టర్లలో ‘మీ ప్రభుత్వంలో జరిగిందేంటి కేటీఆర్?’ అని హెడ్డింగ్ రాసి ఉంది. అదేవిధంగా సంవత్సరాల వారీగా పేపర్ల లీక్‌ను ఆ ఫ్లెక్సీలో క్లియర్‌గా ప్రస్తావించారు. జూలై 2016: ఎంసెట్-II (మెడికల్) పేపర్ లీక్, 2018: వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, మార్చి 2023: తీవ్ర సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్, 3 ఏప్రిల్, 2023: వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు పేపర్ లీక్, 4 ఏప్రిల్, 2023: హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో పదో తరగతి హిందీ పేపర్ లీక్, ఏప్రిల్ 2023: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రవాణాలో ఉండగా 30 పదో తరగతి సమాధాన పత్రాల బండిల్ మాయం లాంటి అంశాలను ప్రస్తావించారు.
కేటీఆర్‌కు సూటీ ప్రశ్న..
అయితే, కేటీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన పోస్టర్ అడుగున (‘WHAT DID YOUR GOVT DO ABOUT IT KTR?’) రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీలపై మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది కేటీఆర్? అని రాసి రాసి సూటిగా ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం నగరం నడిబొడ్డున వెలిసిన ఫ్లె్క్సీ ఉన్న ప్లకార్డుతో కేటీఆర్‌ను నేరుగా ప్రశ్నించారు. ప్రస్తుతం నగరం నడిబొడ్డున వెలిసిన ఫ్లెక్సీలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పెంచేస్తున్నాయి.






