లైవ్ ఏఐతో కొత్త ఆశలు.. రియల్ టైమ్ వీడియో ఎడిటింగ్‌లో అద్భుతం!

by Javid Pasha |

హావభావాలు, కదలికలు, బ్యాక్‌గ్రౌండ్, ఇలా లైవ్‌లోనే మొత్తం విజువల్ ఎఫెక్ట్స్‌ను మార్చే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

లైవ్ ఏఐతో కొత్త ఆశలు.. రియల్ టైమ్ వీడియో ఎడిటింగ్‌లో అద్భుతం!
X

దిశ, ఫీచర్స్ : ఏఐ ఎన్ని అద్భుతాలు చేస్తోందో తెలిసిందే కదా.. ప్రస్తుం లైవ్ ఏఐ మోడల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా డెకార్ట్ ఏఐ (Decart AI ) అనే సంస్థ ఇటీవల లూసీ 2.5 పేరుతో ఒక అధునాతన లైవ్ ఏఐ మోడల్‌ను లాంచ్ చేయగా.. సోషల్ మీడియాలో దానిగురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. లూసీ రియల్ టైమ్ లైవ్ వీడియోలను యూజర్లకు నచ్చిన విధంగా పూర్తిగా మార్చగల సామర్థ్యం కలిగి ఉందని కూడా సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఇంకా ఏయే ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం పదండి!

లూసీ 2.5 అనే లైవ్ ఏఐ మోడల్ ద్వారా ఒక వ్యక్తి మాట్లాడుతున్న హావభావాలు, కదలికలు, దుస్తులు, క్యారెక్టర్, బ్యాక్‌గ్రౌండ్, చుట్టుపక్కల పర్యావరణం ఇలా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్‌ను కూడా మార్చవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం వీడియో ఎడిటింగ్‌కు మాత్రమే పరిమితం కాదు, ఆధునిక సంస్థలకు, టెక్ ఆధారిత కంపెనీలకు కొత్త తరహా ఇంటరాక్టివ్ అనుభవాలను అందించే సాధనంగా కూడా పనిచేస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా షాపింగ్, అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా, స్ట్రీమింగ్ & గేమింగ్ రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. అంతేకాకుండా లైవ్ వీడియోలో జరుగుతున్న వాస్తవికతను(reality)నిజ సమయంలోనే ఎడిట్ చేయడం ద్వారా సృజనాత్మకతకు కొత్త మార్గాలను చూపుతోంది. దీంతోపాటు కంటెంట్ క్రియేటర్లు, బ్రాండ్లు, డెవలపర్లకు ఈ లైవ్ ఏఐ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story