- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు IAS లాంటి ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకీ రావాలి: మంత్రి నారా లోకేశ్
విద్యార్థులు కేవలం ఐఏఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి కూడా రావాలని మంత్రి నారాలోకేష్ అన్నారు. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ అవుతామని చెబుతున్నారు తప్ప రాజకీయాల్లోకి వస్తామని చెప్పట్లేదన్నారు.

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులు కేవలం ఐఏఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి కూడా రావాలని మంత్రి నారాలోకేష్ అన్నారు. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ అవుతామని చెబుతున్నారు తప్ప రాజకీయాల్లోకి వస్తామని చెప్పట్లేదన్నారు. కానీ విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి రావాలని తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని చెప్పారు. సమాజంలో మహిళలను గౌరవించడం మన ఇంటి నుండే మొదలవ్వాలని అన్నారు. అమ్మాయిలా ఏడవద్దు, చీరకట్టుకో, గాజులు వేసుకో అంటూ మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఎవరైనా జోలికి వస్తే లోకేష్ అన్న తోలు తీస్తాడని వార్నింగ్ ఇవ్వాలని విద్యార్థునులకు సూచించారు. సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని, అందుకే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యాశాఖ సలహాదారుగా నియమించినట్టు తెలిపారు. మరోవైపు ఈ పర్యటనలో భాగంగా రంపచోడవరంలో చేపలవేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను లోకేష్ పరామర్శించారు. వారి కుటుంబాల కష్టసుఖాలను అడిగితెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అవసరమైన ఆర్థిక, సమాజిక సహకారం అందిస్తామని చెప్పారు.






