‘జననాయగన్’లో సీన్లు కట్..క‌న్నీళ్లు పెట్టుకున్న నటి

by velandi.Saikiran |

విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం నుంచి తన సన్నివేశాన్ని తొలగించడంతో తమిళ నటి ఆనంది అజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘జననాయగన్’లో సీన్లు కట్..క‌న్నీళ్లు పెట్టుకున్న నటి
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay Thalapathy) నటించిన లేటెస్ట్ మూవీ జన నాయగన్. జులై 23వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో దూసుకు వెళ్తోంది. అయితే ఈ సినిమాలో తన సీన్లు కట్ చేయడంపై తమిళ న‌టి ఆనంది అజయ్ ( Anandi Ajay) కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మూవీలో తనను తాను చూసుకునేందుకు ఏడాదిగా ఎదురుచూస్తున్నానని.. కానీ స్క్రీన్ పై తన సీన్లు లేకపోవడంతో గుండె బద్దలైనట్లు ఎమోషనల్ అయ్యారు. విజయ్ చివరి సినిమా కావడంతో ఆయనతో నటించే అవకాశం మళ్ళీ తనకు రాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన సినిమా ప్రియులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

పూజా హెగ్డే సీన్లు కూడా కట్ ?

విజయ్ చివరి సినిమా జన నాయగన్ లో హీరోయిన్ పూజా హెగ్డే సీన్స్ కూడా కట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ముందుగా పూజాకు సంబంధించిన సీన్లు బాగానే ఉండేవట. కానీ హీరో విజయ్ ని బాగా చూపించే, క్రమంలో పూజా పాత్ర‌ను కూడా త‌గ్గించార‌ని అంటున్నారు.

Next Story