ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా..

by Taduka Kalyani |

టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు కోసం చేపట్టిన జనజాగరణ రాష్ట్రయాత్ర శుక్రవారం ఆదిలాబాద్‌కు చేరుకుంది.

ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా..
X

దిశ, ఆదిలాబాద్ : టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు కోసం చేపట్టిన జనజాగరణ రాష్ట్రయాత్ర శుక్రవారం ఆదిలాబాద్‌కు చేరుకుంది.ఈ సందర్భంగా పీఆర్‌టీయూ తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా శాఖ రాష్ట్రయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.సంఘం ప్రతినిధులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ, రానున్న శాసనసభ సమావేశాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు ఆడే నూర్ సింగ్, ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ కోసం చేపడుతున్న ఉద్యమానికి అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.

Next Story