పనితీరు మెరుగుపడేందుకు టెక్ శిక్షణ తప్పనిసరి

by Taduka Kalyani |

ప్రస్తుతం పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విస్తృతమవుతోందని అదనపు ఎస్పీ అన్నారు.

పనితీరు మెరుగుపడేందుకు టెక్ శిక్షణ తప్పనిసరి
X

దిశ, సంగారెడ్డి అర్బన్: జిల్లా పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు వోక్సెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విస్తృతమవుతోందని అన్నారు. సిబ్బంది ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై పట్టు సాధించడం అత్యంత అవసరమని తెలిపారు. ఎంఎస్ ఆఫీస్, ముఖ్యంగా వర్డ్, ఎక్సెల్ వంటి సాఫ్ట్‌వేర్‌లలో ప్రావీణ్యం పెరగడం ద్వారా కార్యాలయ పనితీరులో వేగం, ఖచ్చితత్వం, సమర్థత మరింతమెరుగుపడుతుందని పేర్కొన్నారు.జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, స్టేషన్ రైటర్లు, సైబర్ వారియర్స్, టెక్ టీమ్ సిబ్బందికి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు మొత్తం 180 మంది సిబ్బందిని 3 బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు 3 రోజుల చొప్పున శిక్షణ అందిస్తున్నామని అన్నారు.శిక్షణలో నేర్చుకున్న అంశాలను రోజువారీ విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీసు శాఖలో సేవల నాణ్యతను పెంచడంలో ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న సిబ్బందికి జిల్లా అదనపుఎస్పీ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. వోక్సెన్ యూనివర్సిటీ యాజమాన్యం, ప్రొఫెసర్లకు పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వోక్సెన్ యూనివర్సిటీ డీన్ డా. దయాశంకర్, అసిస్టెంట్ డీన్స్, ప్రొఫెసర్స్, జిల్లా పోలీసు అధికారులు, శిక్షణ పొందిన సిబ్బంది పాల్గొన్నారు.

Next Story