- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక్కడ కాదు.. అక్కడ మాట్లాడండి: బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సవాల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దమ్ముంటే నీట్ పేపర్ లీక్ ఘటనపై పార్లమెంట్‌లో మాట్లాడాలని, రాష్ట్రంలో కాదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సవాల్ విసిరారు. ..

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahungandi)కి దమ్ముంటే నీట్ పేపర్ లీక్ ఘటన(Neet Paper leak Incident)పై పార్లమెంట్(Parliament)లో మాట్లాడాలని, రాష్ట్రంలో కాదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్(BJP AP President Madhav) సవాల్ విసిరారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై ఆయన మండిపడ్డారు. నీట్‌లో లీకులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. కానీ నీట్ లీక్ పేరుతో యువతను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో మత విద్వేషాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నీట్ సాకుతో ప్రధాని మోడీ, సుప్రీంకోర్టుపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరికాదన్నారు. విద్రోహంగా, దేశ వ్యతిరేకంగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెండ్ సంఘాలు విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేస్తాయా అని ప్రశ్నించారు. రోడ్లపై కాకుండా పార్లమెంట్ లో జరిగే చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనాలని మాధవ్ హితవు పలికారు.






