కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం.. పంటకాల్వలో మునిగి ముగ్గురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-24 15:34:24  IST  )

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటయ్యపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందిన పావని, రంజిత్, వీరేంద్ర పంటకాల్వలో స్నానానికి వెళ్లారు..

కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం.. పంటకాల్వలో మునిగి ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటయ్యపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందిన పావని, రంజిత్, వీరేంద్ర పంటకాల్వలో స్నానానికి వెళ్లారు. అయితే నీటిలో గల్లంతయ్యారు. తొలుత పావని గల్లంతుకాగా కాపాడే క్రమంలో రంజిత్, వీరేంద్ర కూడా నీటిలో కొట్టుకుపోయారు. దీంతో స్థానికులు గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి...

Next Story