ఎస్‌బీఐ ఆశ స్కాలర్‌షిప్-2026 దరఖాస్తులు ప్రారంభం

by velandi.Saikiran |

ప్లాటినం జూబ్లీ ఆశ స్కాలర్‌షిప్-2026కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

ఎస్‌బీఐ ఆశ స్కాలర్‌షిప్-2026 దరఖాస్తులు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్లాటినం జూబ్లీ ఆశ స్కాలర్‌షిప్-2026కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రూ.15,000, డిగ్రీ విద్యార్థులకు రూ.75,000, పీజీ విద్యార్థులకు రూ.1,50,000, ఐఐటీ విద్యార్థులకు రూ.2,00,000, ఐఐఎం విద్యార్థులకు రూ.5,00,000, వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు రూ.2,00,000, అలాగే విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏడాదికి రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.

గత విద్యా సంవత్సరంలో 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల లోపు ఉన్న భారతీయ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ మార్కుల మెమో, ఆధార్ కార్డు, ఫీజు చెల్లించిన రసీదు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్ ప్రతితో కలిసి సెప్టెంబర్ 4లోపు www.sbifashascholarship.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అన్ని వర్గాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని యాకూబ్ పాషా కోరారు. మరిన్ని వివరాల కోసం 85208 60785 నంబర్‌ను సంప్రదించవచ్చని లేదా పై వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

Next Story