మళ్లీ కరోనా కేసుల కలవరం.. కొత్తగా ఏడుగురికి పాజిటివ్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు యాక్టివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. బాధితులను వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. ...

మళ్లీ కరోనా కేసుల కలవరం.. కొత్తగా ఏడుగురికి పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు యాక్టివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. బాధితులను వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది చర్యలు వేగవంతం చేశారు. జిల్లాల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేయడంతో పాటు పరీక్షల సంఖ్యను పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా పట్ల ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులను తరచూ పరిశుభ్రంగా ఉంచుకోవడం శ్రేయస్కరమని చెప్పారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెల్త్ బులెటిన్ ద్వారా వైద్యులు వెల్లడించారు.

Next Story