కేవ‌లం కారు కొనాల‌నే ఆశ‌తో ఇండస్ట్రీలోకి వచ్చా!

by velandi.Saikiran |   (  Updated:2026-07-24 17:26:01  IST  )

కేవ‌లం కారు కొనాల‌నే ఆశ‌తో ఇండస్ట్రీలోకి వచ్చాన‌ని ర‌కుల్ వెల్ల‌డించారు.

కేవ‌లం కారు కొనాల‌నే ఆశ‌తో ఇండస్ట్రీలోకి వచ్చా!
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. అతి తక్కువ కాలంలోనే పాపులారిటీ సంపాదించిన ఆమె... స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. 2013లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు అభిమానులకు పరిచయమై... ఆ తర్వాత లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ లాంటి ఎన్నో బంపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే అలాంటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలోకి రావడం వెనుక అసలు కారణాన్ని తెలిపారు. 2009లో కాలేజీలో చదువుతున్నప్పుడు అనుకోకుండా కన్నడ సినిమా గిల్లీలో అవకాశం వచ్చిందని వివరించారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదని... నిర్మాతలు రూ. 5 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దీంతో కారు కొనుక్కోవాలని.. డిసైడ్ అయినట్లు వివరించారు. తన స్నేహితుల కంటే ముందుగానే, ఆ డబ్బులతో కారు కూడా కొనేసినట్లు తెలిపారు. అలా తను ఇండస్ట్రీలోకి వచ్చినట్లు వివరించారు. కాగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ర‌కుల్.

Next Story