- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టిక్కెట్ల విడుదలకు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) జూన్–2026కు సంబంధించి మొత్తం 2,13,520 మంది అభ్యర్థులు 2,37,165 దరఖాస్తులను సమర్పించినట్లు ఏపీ టెట్–2026 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు. ..

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) జూన్–2026కు సంబంధించి మొత్తం 2,13,520 మంది అభ్యర్థులు 2,37,165 దరఖాస్తులను సమర్పించినట్లు ఏపీ టెట్–2026 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ పరీక్ష విధానంపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను జూలై 25 నుంచి http://cse.ap.gov.in మరియు http://tet2dsc.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
ఏపీ టెట్–జూన్ 2026 పరీక్షలు ఆగస్టు 5 నుంచి ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వివరించారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అలాగే మాక్ టెస్ట్ ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంపై ముందస్తు అవగాహన పొందాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.






