మంగ్లీ బోనాల సాంగ్ రిలీజ్.. నెట్టింట్లో ఫుల్ ట్రోలింగ్

by Ajay Maddhiboyina |

ఏ పండగ వ‌చ్చినా క్రియేట‌ర్లు ఈ మ‌ధ్య స్పెష‌ల్ సాంగ్స్ విడుద‌ల చేస్తున్నారు. శివ‌రాత్రి, భోనాలు, బ‌తుక‌మ్మ ఇలా పండుగ ఏదైనా పాట ఉండాల్సిందే. ఆ పాట‌కు చిందులు వేయాల్సిందే. పండ‌గ‌లకు స్పెష‌ల్ సాంగ్స్ తీసేవారిలో సింగ‌ర్ మంగ్లీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే.

మంగ్లీ బోనాల సాంగ్ రిలీజ్.. నెట్టింట్లో ఫుల్ ట్రోలింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏ పండగ వ‌చ్చినా క్రియేట‌ర్లు ఈ మ‌ధ్య స్పెష‌ల్ సాంగ్స్ విడుద‌ల చేస్తున్నారు. శివ‌రాత్రి, భోనాలు, బ‌తుక‌మ్మ ఇలా పండుగ ఏదైనా పాట ఉండాల్సిందే. ఆ పాట‌కు చిందులు వేయాల్సిందే. పండ‌గ‌లకు స్పెష‌ల్ సాంగ్స్ తీసేవారిలో సింగ‌ర్ మంగ్లీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు మంగ్లీ పాట వ‌స్తుంది అంటే చాలు ముందు నుండే ఎంతో క్రేజ్ ఉండేది. పాట‌కు ముందు విడుద‌ల చేసిన ప్రోమోకే మిలియ‌న్స్ కొద్ది వ్యూవ్స్ వ‌చ్చేవి. కానీ ఈసారి భోనాల‌కు విడుద‌ల చేసిన పాట‌కు మాత్రం ప్ర‌శంస‌ల‌కు బ‌దులు మంగ్లీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఇటీవ‌ల మంగ్లీ పేరు ఓ స్కామ్ లో వినిపించిన సంగ‌తి తెలిసిందే. దీంతో భోనాల పండుగ సంద‌ర్భంగా మంగ్లీ తీసిన తీరు..తీరు తొట్టెల్ల‌ల పాట కింద నెటిజ‌న్లు మంగ్లీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దొంగ మంగ్లీ అంటూ కామెంట్ చేస్తూ దాడి చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ ను ఆమె మాత్రం ప‌ట్టించుకోవ‌డంలేదు. ఇప్ప‌టికే మంగ్లీ ఆ స్కామ్ తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ ట్రోల్స్ మాత్రం ఆగ‌డంలేదు. మ‌రోవైపు స్కామ్ లో మంగ్లీ దోషి అంటూ కూడా నిర్దార‌ణ కాలేదు. అయిన‌ప్ప‌టికీ ఆమెపై ట్రోల్స్ వ‌స్తూనే ఉన్నాయి.

Next Story