చిరుత దాడిలో కాడెద్దు మృతి

by Ratna Kumari |

అచ్చంపేట మండలం అక్కారం గ్రామంలో చిరుతపులి దాడిలో రైతుకు చెందిన కాడెద్దు మృతి చెందడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.

చిరుత దాడిలో కాడెద్దు మృతి
X

దిశ, అచ్చంపేట : అచ్చంపేట మండలం అక్కారం గ్రామంలో చిరుతపులి దాడిలో రైతుకు చెందిన కాడెద్దు మృతి చెందడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన బాణావత్ రవి అనే రైతుకు చెందిన కాడెద్దుపై చిరుత దాడి చేయడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో రైతుకు సుమారు రూ.50 వేల మేర నష్టం వాటిల్లినట్లు గ్రామ సర్పంచ్ లాలూ నాయక్ తెలిపారు. బాధిత రైతును ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు వెంటనే ఆదుకుని తగిన ఆర్థిక సాయం అందించాలని సర్పంచ్ కోరారు. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో చిరుతల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, పశువుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Next Story