- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: కేంద్ర మంత్రి రాజీనామా
బీజేపీ నేత, కేంద్ర రైల్వేశాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం జూన్‌లో ముగియడంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత, కేంద్ర రైల్వేశాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం జూన్‌లో ముగియడంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో బలమైన నేతగా ఉన్న బిట్టుకు ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ అధికారంలో ఉండగా.. అక్కడ ఫోకస్ మరింత పెంచాలని బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. రవ్ నీత్ సింగ్ సిక్కు వర్గానికి చెందిన నేత కావడం, పంజాబ్‌లో సిక్కులు ఎక్కువగా ఉండటంతో వారి ఓట్లను ఆకర్షించేందుకు కూడా ముందే రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే రవ్ నీత్ సింగ్ బిట్టూ పంజాబ్ మాజీ సీఎం బీంత్ సింగ్ మనవడు. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం పనిచేసిన ఈయన 2024లో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. తరవాత ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది.






