కోనేటిలో పడి డ్రైవర్ మృతి

by Ratna Kumari |

వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం సమీపంలోని కోనేటిలో ప్రమాదవశాత్తు పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

కోనేటిలో పడి డ్రైవర్ మృతి
X

దిశ, గోపాల్పేట : వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం సమీపంలోని కోనేటిలో ప్రమాదవశాత్తు పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గోపాల్పేటకు చెందిన ఎండి నజీర్ (43) ప్రమాదవశాత్తు కోనేటిలో పడిపోయాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో బంధువులు, పోలీసులు కలిసి గాలింపు చేపట్టగా కోనేటిలో మృతదేహం లభ్యమైంది. మృతుడి మేనల్లుడు ఎండి మహమూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Next Story