మిస్సింగ్ కేసులో మహిళ మృతదేహం లభ్యం

by Ratna Kumari |

నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసుగా నమోదైన మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది.

మిస్సింగ్ కేసులో మహిళ మృతదేహం లభ్యం
X

దిశ, మద్దూరు : నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసుగా నమోదైన మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మద్దూరు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాదరవ్‌పల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ ఈ నెల 11న ఇంటి నుంచి ఓ కార్యక్రమానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుమారుడు మహేష్ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో గురువారం సాయంత్రం నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామ శివారులోని చెరువు సమీపంలోని పొదల్లో శాంతమ్మ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాల కోసమే హత్య జరిగి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు. నిందితులను త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Next Story