భార్యపై కత్తెరతో భర్త దాడి

by Ratna Kumari |

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తెరతో దాడి చేసిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

భార్యపై కత్తెరతో భర్త దాడి
X

దిశ, ఘట్కేసర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తెరతో దాడి చేసిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహమ్మద్ రహీం, రిజ్వానా బేగం దంపతులు గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా కుటుంబ విభేదాల కారణంగా వేర్వేరుగా నివసిస్తున్నారు. ఇటీవల వివాదాలు మరింత తీవ్రం కావడంతో రిజ్వానా బేగం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, ఇరు పక్షాలను కౌన్సెలింగ్ కోసం సెంటర్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఎమోషనల్ వెల్‌బీయింగ్ (సీడీఈడబ్ల్యూ)కు పంపించారు.

శుక్రవారం కౌన్సెలింగ్ సందర్భంగా జరిగిన చర్చలో మహమ్మద్ రహీం ఆగ్రహంతో కత్తెరతో రిజ్వానా బేగంపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ఛాతీ, చేతి, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడు మహమ్మద్ ఫహద్ సైఫుల్లాపై కూడా దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన రిజ్వానా బేగంను తొలుత ఘట్కేసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు మహమ్మద్ ఫహద్ సైఫుల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు మహమ్మద్ రహీంను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story