డిప్యూటీ సీఎంను కలవనివ్వకుండా సింగరేణి యాజమాన్యం కుట్ర

by Kodari Anjali |

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కలవనివ్వకుండా సింగరేణి యాజమాన్యం కుట్ర చేసిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మణుగూరు ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వై. రామ్ గోపాల్ అన్నారు.

డిప్యూటీ సీఎంను కలవనివ్వకుండా సింగరేణి యాజమాన్యం కుట్ర
X

దిశ, మణుగూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలవనివ్వకుండా సింగరేణి యాజమాన్యం కుట్ర చేసిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏ ఐ టీయూ సీ) మణుగూరు ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వై. రామ్ గోపాల్ అన్నారు. ఆయన శుక్రవారం పీకే ఓసి -2 గని వద్ద జరిగిన ఆందోళన అనంతరం మాట్లాడారు. పీకే ఓ సీటు టిప్ సైట్ బ్లాకును వేలంపాట వేశారని, ఎందుకు సంబంధించి డిప్యూటీ సీఎంను కలుద్దామని ఉదయం నుంచి సాయంత్రం దాకా కార్మికులు, కార్మిక నాయకులు వేచి చూశామన్నారు. డిప్ సైడు బ్లాక్ ను జెన్కోకు ఇవ్వాలని కుట్ర నడుస్తుందని, ఈ కుట్రను చేదించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్ట్ లేకపోతే ఏమవుద్దో ఇల్లందు ఏరియాను చూస్తున్నామని, అదేవిధంగా మణుగూరు ఏరియా తయారయ్యే పరిస్థితి ఉందన్నారు. జే 7 జీ 9 హైయెస్ట్ కోల్ దిబ్ సైడ్ లో ఉందన్నారు. మణుగూరు అంటేనే సింగరేణికి తల మాణికం, గుండెకాయ అన్నారు. అన్ని ఏరియాలలో నష్టాలు జరిగినా లాభాల బాటలో నడిపించి నష్టాన్ని పూడ్చిన గణత మణుగూరు ఏరియాకు ఉందన్నారు. డిప్ సైడ్ ను జెన్కోకి ఇస్తే ఏ కంపెనీని కూడా మణుగూరులో అడుగుపెట్టనీయకుండా మణుగూరు ప్రజలను చైతన్యం చేసి అడ్డుకుంటామన్నారు. సింగరేణి సొత్తును ప్రైవేటు కి అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు.

Next Story