సీరియల్స్‌లోకి అవికా గోర్.. మొదలుపెట్టిన చోటుకే చేరుకున్నానంటూ పోస్ట్‌‌.. కారణం అదేనా?

by Mallepaka Hamsa |

తన కెరీర్ ఎక్కడైతే ప్రారంభమైందో మళ్లీ అక్కడికే చేరుకున్నానని, మొదలుపెట్టిన చోటుకే తిరిగి రావడం ఎంతో అందమైన విషయమని ఆమె పేర్కొన్నారు.

సీరియల్స్‌లోకి అవికా గోర్.. మొదలుపెట్టిన చోటుకే చేరుకున్నానంటూ పోస్ట్‌‌.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అవికా గోర్ ‘చిన్నారి పెళ్లికూతురు’ సిరీయల్‌తో బుల్లితెరపై విపరీతమైన క్రేజ్‌కు రాబట్టుకున్నారు. ఆ తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును రాబట్టుకున్నారు. ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ భామ పలు చిత్రాలతో మెప్పించారు. కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే తన ప్రియుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. వివాహం తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ భామ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. తన కెరీర్ ఎక్కడైతే ప్రారంభమైందో మళ్లీ అక్కడికే చేరుకున్నానని, మొదలుపెట్టిన చోటుకే తిరిగి రావడం ఎంతో అందమైన విషయమని ఆమె పేర్కొన్నారు. జీవితంలో కొత్త దారుల్లో ప్రయాణించడాన్ని ప్రశంసించుకున్నట్లే, అప్పుడప్పుడు జీవితం మనల్ని మూలాల వైపు తీసుకెళ్తుందని చెప్పారు. అలా వెనక్కి వెళ్లడం అంటే ఓటమి కాదని, ఒక కొత్త కోణంలో విషయాన్ని అర్థం చేసుకునేంతగా మనం ఎదిగామని దానికి అర్థమని వివరించారు. అయితే వెండితెరపై అవకాశాలు తగ్గడం వల్లే ఆమె మళ్లీ బుల్లితెరకు రీఎంట్రీ ఇస్తున్నారనే సంకేతంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.

Next Story