- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్కాజిగిరి కమిషనరేట్‌లో కీలక పోలీసు స్టేషన్లకు మహిళా ఎస్‌హెచ్‌ఓలు..?
మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలోని పలు కీలక పోలీసు స్టేషన్లకు మహిళా పోలీసు అధికారులను స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్‌హెచ్‌ఓ) నియమించేందుకు కసరత్తు జరుగుతోందని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది.

దిశ, సిటీ క్రైమ్: మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలోని పలు కీలక పోలీసు స్టేషన్లకు మహిళా పోలీసు అధికారులను స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్‌హెచ్‌ఓ) నియమించేందుకు కసరత్తు జరుగుతోందని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నియామకాలకు సంబంధించి పోలీసు కమిషనర్ సుమతి ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో కసరత్తు చేసినట్లు సమాచారం. మల్కాజిగిరి కమిషనరేట్‌కు మహిళా పోలీసు కమిషనర్ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో, కీలక పోలీసు స్టేషన్లలోనూ మహిళా ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించడం ద్వారా మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణలో వారి పాత్రను మరింత బలోపేతం చేయాలనే ఆలోచన ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో కమిషనరేట్ పరిధిలోని 28 లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు మరో రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే మహిళా ఎస్‌హెచ్‌ఓల నియామకాలు, ఇన్‌స్పెక్టర్ల బదిలీలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కమిషనరేట్‌లో జరిగే మార్పులపై పోలీసు వర్గాలతో పాటు సిబ్బందిలోనూ ఆసక్తి నెలకొంది.






