తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించా.. ఎమ్మెల్యే సామేల్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

తుంగ‌తుర్తి ఎమ్మెల్యే మందుల స‌మేల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి స్పందించారు. తుంగ‌తుర్తి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని, అక్క‌డ త‌ప్పుడు వ్య‌క్తిని బ‌రిలో దింపి గెలిపించాన‌ని అన్నారు.

తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించా.. ఎమ్మెల్యే సామేల్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తుంగ‌తుర్తి ఎమ్మెల్యే మందుల స‌మేల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి స్పందించారు. తుంగ‌తుర్తి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని, అక్క‌డ త‌ప్పుడు వ్య‌క్తిని బ‌రిలో దింపి గెలిపించాన‌ని అన్నారు. టికెట్ కోసం ముంద సామేల్ త‌న ఇంటికి వంద‌సార్లు వ‌చ్చాడ‌ని వ్యాఖ్యానించారు. చాలా మంది టికెట్ కోసం పోటిప‌డినా మాటిచ్చాన‌ని సామేల్ కు టికెట్ ఇప్పించి గెలిపించాన‌ని అన్నారు. తిరుమ‌ల‌లో ఉన్న‌ప్పుడు త‌న‌కు సామేల్ ఫోన్ చేస్తే దేవుడి స‌న్నిధిలో ఉన్నాన‌ని, టికెట్ ఇప్పిస్తాన‌ని మాటిచ్చి అధిష్టానంతో మాట్లాడి ఇప్పించాన‌ని తెలిపారు.

భాన్సువాడ‌లో ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డికి కూడా తానే టికెట్ ఇప్పించాన‌ని అన్నారు. తుంగ‌తుర్తి, న‌కిరేక‌ల్, భువ‌న‌గిరి, ఆలేరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని వారిని గెలిపించాన‌ని చెప్పారు. ఎన్నిక‌ల‌కు త‌క్కువ స‌మ‌యం ఉన్నా వారికోసం ప్ర‌చారంలో పాల్గొన్నానని అన్నారు. తుంగ‌తుర్తి మాత్ర‌మే కాకుండా రాష్ట్రం మొత్తంలోని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకోవాల్సిన బాధ‌త్య త‌న‌పై ఉంద‌ని, ఆయారం, గ‌యారాంల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌ని వ్యాఖ్యానించారు. నిజ‌మైన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ పై, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ పై త‌మ‌లాంటి నాయకుల‌పై కూడా ఉంద‌న్నారు.

Next Story